ASR: జిల్లా పాడేరు కోర్టులో శనివారం జరిగిన లోక్ అదాలత్లో బాలలతో పని చేయించిన 8 మంది యజమానులకు జరిమానా విధించారని జిల్లా సహాయ కార్మిక అధికారి పీ. సూర్యనారాయణ తెలిపారు. ఇటీవల పాడేరు, అరకు, హుకుంపేట, జీ.మాడుగుల మండలాల్లో తనిఖీలు చేపట్టి 8 మంది బాల కార్మికులను గుర్తించి, యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈమేరకు మెజిస్ట్రేట్ ఏ. రాము వారికి జరిమానాలు విధించారన్నారు.