‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు అభిషన్ జీవింత్. తాజాగా ఆయన హీరోగా మారి ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి ‘కరెక్టెడ్ మచ్చి’ టైటిల్ను ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో మలయాళ నటి అనశ్వర రాజన్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్.