50 పైసల నాణెం చెల్లుబాటు అవుతుందా అని ప్రజల్లో ఉన్న సందేహాలపై RBI క్లారిటీ ఇచ్చింది. వాట్సాప్ ద్వారా పంపిన సందేశాల్లో, 50 పైసల నుంచి రూ.20 వరకు ఉన్న అన్ని నాణేలు పూర్తిగా చట్టబద్ధమైనవని, ఇప్పటికీ చలామణిలో కొనసాగుతున్నాయని పేర్కొంది. తప్పుడు సమాచారం నమ్మకుండా, వ్యాపారులు నాణేలను స్వీకరించాలని RBI కోరింది.