NZB: గత వర్షాకాలంలో గోడకూలిన ఘటనలో తనకు నష్టపరిహారం అందకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలో నేడు చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. పోతంగల్ గ్రామంలో ఇందురు సాయిలు తన భార్యపిల్లలతో నివాసముండేవాడు. అయితే గత వర్షాకాలంలో భారీ వర్షానికి ఇంటిపక్కన ఉన్న గోడకూలి తన భార్య, కూతురు మృతి చెందారు.