MDK: వెల్దుర్తి మండలం కుకూనూర్లో ఓ కిరాణా దుకాణంలో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధిచిన కిరాణా దుకాణంలో తనిఖీ చేయగా మద్యం బాటిళ్లు లభించాయి. వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దుకాణ యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.