ASF: తిర్యాణి మండలం దానాపూర్ గ్రామానికి చెందిన టేకం కన్నబాయి సోమవారం పురిటి నొప్పులతో బాధపడింది. కుటుంబసభ్యులు ఆమెను 108 అంబులెన్స్‌లో తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ప్రసవించింది. అంబులెన్స్ సిబ్బంది సాయంతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. EMT సురేశ్, పైలట్ వాసుదేవ్ సహకారంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు.