VZM: జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్‌కు కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి కొత్తూరు రెల్లి గ్రామ శివారులో కోడిపందేలు ఆడుతున్న ఖచ్చితమైన సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచి సిబ్బందితో దాడులు చేపట్టారు. దాడుల్లో కోడిపందేలు ఆడుతున్న తొమ్మిది మందిని ఎస్. బి సిబ్బంది అదుపులోకి తీసుకొని, వారివద్ద నుంచి రూ. 16,870 నగదు, ఒక కోడిపుంజు,10 చరావణులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.