TG: ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు వెయ్యి సీసీ కెమెరాలు, 6 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు 2500 మంది అతిథులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సమ్మిట్‌కు వచ్చే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గ్లోబల్ సమ్మిట్ దగ్గర 3 హెలిప్యాడ్స్ ఏర్పాటు చేశారు. డెలిగేట్స్ కోసం పైలట్ వాహనాలు సిద్ధం చేశారు.