కోనసీమ: రైతు నిలదొక్కుకోవాలి, రైతులకు ఆదాయం రావాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మార్కెట్ యార్డులో రైతుల కోసం రావులపాలెం సొసైటీ అధ్యక్షులు కె.వి.సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు ఖర్చులను తగ్గించడానికి సాంకేతికతను వినియోగించాలన్నారు.