ములుగు ప్రభుత్వ వైద్య కళాశాల ఎంబీబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థులు ఎన్ఎంసీ పాఠ్య ప్రణాళికలో భాగంగా ములుగు కృష్ణ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీడీపీవో శిరీష, అంగన్వాడీ సూపర్వైజర్లు ఆరు సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు అందించే ఐదు రకాల సేవలను వైద్య విద్యార్థులకు వివరించారు.