CTR: మద్యం సేవించి వాహనం నడిపిన 4 మందికి కోర్టు రూ.10,000 చొప్పున మొత్తం రూ.40,000 జరిమానా విధించింది. వారిలో ఒకరికి జరిమానాతో పాటు కోర్టులో ఒకరోజు నిలబడి ఉండే శిక్ష విధించారు. అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన 6 పెట్టీ షాపులపై రూ.300 జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.