W.G: నరసాపురం మండలంలోని ఎల్బీచర్ల జడ్పీ హైస్కూల్లో శనివారం ఉపాధ్యాయులకు మండల స్థాయిలో ఆటలు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో పి.పుష్పరాజ్యం తెలిపారు. మహిళ ఉపాధ్యాయులకు త్రోబాల్, పురుషులకు క్రికెట్ టీం సెలక్షన్ జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 10 గంటలకు మైదానంలో ఉండాలని ఆమె కోరారు.