టాలీవుడ్ సినీ జర్నలిస్టుల్లో సురేష్ కొండేటి పేరు.. ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది. హీరోయిన్ పుట్టు మచ్చల గురించి అడిగినప్పటి నుంచి కొండేటి ఏది అడిగినా వైరల్ అవుతునే ఉంది. దీంతో డైరెక్టర్స్‌కు సురేష్ కొండేటి కాంట్రవర్శీ క్వశ్చన్స్ వేస్తూ.. ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. కానీ రీసెంట్గా హరీష్ శంకర్, తేజ కొండేటిని ఆడుకున్నారు. తేజ అయితే భయపెట్టినంత పని చేశాడు. అందుకే ఈయన సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.
వరుస ఫ్లాపుల్లో ఉన్న తేజ లేటెస్ట్ ఫిల్మ్ ‘అహింస’. దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. గీతిక హీరోయిన్గా నటిస్తోంది. చాలా వాయిదాల తర్వాత జూన్ 2న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. వరుస ఇంటర్య్వూలు, ప్రెస్ మీట్లతో సందడి చేస్తోంది. ఈ సందర్బంగా జర్నలిస్ట్ సురేష్ కొండేటికి షాక్ ఇచ్చాడు తేజ. అసలే తేజ అంటే ఫైర్‌లా ఉంటాడు. ఆయన కౌంటర్ ఊహించని విధంగా ఉంటుంది. అహింస సినిమా టైటిల్ పెట్టి.. హింసను చూపించారు ఎందుకు? అని అడగ్గా.. అలాగే చేస్తాను.. తీయకుడదా? అంటూ సురేష్ కొండేటికి కౌంటర్ ఇచ్చాడు.
సురేష్ కొండేటి చేసిన ట్వీట్:
అందరికీ నమస్కారం,
నేను మీ సురేష్ కొండేటి.. నేను గతంలో 'వార్త' సురేష్ గా, తరువాత సంతోషం సురేష్ గా సినీ పరిశ్రమలో అందరికీ సుపరిచితం. సంతోషం మ్యాగజైన్ ఎడిటర్ గా అసంఖ్యాక ప్రేక్షక లోకానికి కూడా పరిచితమే. 👇 full details.🙏
ఇక ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత రివర్స్‌లో సురేష్ కొండేటినే ఇంటర్వ్యూ చేసి హడలెత్తించాడు తేజ. ‘మీరు మమ్మల్ని ఇరకాటంలో పెట్టడం కాదు.. గతంలో చాలా పెద్ద పెద సినిమాలు, హిట్ సినిమాలు తీసిన మీరు.. ఇప్పుడు ఎందుకు సినిమాలు తీయడం మానేశారు? అని సురేష్‌ను అడిగాడు తేజ. అయితే.. కరోనా కారణంగా జనాలు థియేటర్లు రావడం తగ్గిపోయారని.. ఇప్పటికే రెండు సబ్జెక్ట్స్ లాక్ చేసుకున్నానని.. కానీ భయపడి సినిమాలు చేయడం లేదని చెప్పాడు. దీంతో తేజ.. థియేటర్ల గురించి చెప్తున్నారా? లేదంటే ఆడియన్స్ రావట్లేదని చెప్తున్నారా? అంటూ సెటైర్స్ వేశాడు.
నేను కేవలం అల్ప ప్రాణిని.. కన్ఫ్యూజన్ చేయకుండా సింపుల్‌గా చెప్పాలన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. సురేష్ కొండేటిని టార్గెట్ చేస్తూ కొందరు యూట్యూబర్స్ థంబ్ నెయిల్స్ పెట్టి.. కావాలనేఏ కాంట్రవర్శీ చేస్తున్నారని ఫైర్ అయ్యాడు. అందుకు సంబంధించిన పెద్ద లెటర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అనవసరంగా నన్ను ఇబ్బంది పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లెటర్లో రాసుకొచ్చాడు. ఏదేమైనా.. తేజ వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.