SKLM: అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఎమ్మెల్యేను వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు స్వామి చిత్రపటాన్ని అందజేశారు. నియోజకవర్గ ప్రజలకు స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.