TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరై క్షమాపణ చెప్పారు. బతుకమ్మకుంట కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరై క్షమాపణ చెప్పినట్లు సమాచారం. బతుకమ్మకుంట కేసులో సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హైడ్రాపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు.