టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు నమోదైంది. అతడి భార్య గరిమా తివారీ గృహహింస ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. అమిత్, అతడి కుటుంబం కలిసి తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ యూపీలోని కాన్పూర్ కోర్టును ఆశ్రయించింది. శారీరకంగా, మానసికంగా తనను హింసిస్తున్నారని, ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితులు సృష్టించాడని గరిమా ఫిర్యాదులో పేర్కొంది.