SKLM: ఆమదాలవలసకి చెందిన జిల్లా సీఐటీయూ వ్యవస్థాపకులలో ఒకరైన కామ్రేడ్ మెట్ట కొండయ్య బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు ఆయన భౌతికయానికి CITU జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు జెండా కప్పి నివాళులర్పించి, సంతాపాన్ని తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో పోరాటాలు నడిపిన ఆయన జ్ఞాపకాన్ని సీఐటీయూ నాయకులు స్మరించారు.