SKLM: అచ్చం పాములా కనిపించే ఈ చేప అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అరుదైన చేప బుధవారం పోలాకి మండలం గుప్పిడిపేట సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఇది చిక్కింది. ముందు పాము అనుకున్నామని తర్వాతే ఇది ఒక రకానికి చెందిన ఆరడుగుల ఈల్ చేపగా గుర్తించామని వారు తెలియజేశారు. ఈ చేపను కొన్ని ప్రాంతాలలో తింటారని, మన ప్రాంతంలో ఎవరు తినరు అని స్థానిక మత్స్యకారులు తెలిపారు.