VZM: మండలంలోని ప్రతి పంచాయతీలో 50 మంది వేతనదారులతో ఉపాధి హామీ పనులు ఉదయం,మధ్యహ్నం రెండుపూటలా పని కల్పించి రూ. 307 వేతనం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు బుధవారం కొత్తవలస ఎండీవో కార్యాలయంలో ఎస్.కోట క్లస్టర్ ఏపీడీ పద్మజ క్షేత్ర సహాయకులతో రివ్యూ నిర్వహించారు. అవసరం ఉన్న చోట ప్రతి రైతు ఫారం పాండ్లు తవ్వించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండివో రమణయ్య పాల్గొన్నారు.