ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.