GDWL: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ప్రజలు శాంతియుతంగా, నమ్మకంగా పాల్గొనాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఎర్రవల్లి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, ప్రజల భద్రతకు తాము బాధ్యత వహిస్తామని తెలిపారు. ఎవరైనా ఒత్తిడికి గురిచేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.