NDL: నంద్యాల మండలం ఎన్. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ హరినాథ్ రెడ్డి పొలానికి వెళ్తుండగా కొందరు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజకీయ కక్షతోనే తనపై దాడి జరిగిందని ఆయన తెలిపారు. పోలీసులు రక్షణ కల్పించాలి, దాడి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.