TPT: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ సేవలు ఆన్ లైన్లో అందుబాటులోకి వచ్చాయి. దర్శన టికెట్ల బుకింగ్, ఆర్జిత సేవలు, వసతి, ప్రసాదాలను భక్తులు ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఆన్ లైన్ సేవలకు దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. బుకింగ్ కోసం ఆలయ అధికార వెబ్ సైట్ల ద్వారా సేవలు పొందవచ్చు.