PPM: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ సన్నద్ధమైంది. ఈ నెల 21న జరగనున్న పోలియోడ్రైవ్ పై అధికారులకు, పర్యవేక్షకులకు స్థానిక ఎన్జీవో హోంలో రీ-ఓరియంటేషన్ శిక్షణ జరిగింది. DMHO డా. ఎస్.భాస్కరరావు మాట్లాడుతూ.. చిన్నారుల భవిష్యత్తు ఆరోగ్యం దృష్ట్యా వ్యాక్సిన్ ఆవశ్యకతపై ఇప్పటి నుంచే ప్రజల్లో అవగాహన పెంచాలి అన్నారు.