కృష్ణ: మచిలీపట్నం రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట 3,900 మంది భక్తులు కలిసి కోటి దీపాలు వెలిగించిన ఈ ఘట్టానికి సంస్థ వ్యవస్థాపకుడు చింతపట్ల వెంకటాచారి రికార్డు పత్రం ఆలయ అధికారలకు అందజేశారు.