PLD: జిల్లా వ్యాప్తంగా 347 రైతు సేవా కేంద్రాల వద్ద ‘రైతన్న మీకోసం’ గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మంగళవారం వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో 2025-26 రబీ, 2026 ఖరీఫ్, 2026-27 రబీ సీజన్ల పంట ప్రణాళికలపై రైతులతో తప్పక చర్చించాలని ఆమె సూచించారు.