TG: సంగారెడ్డి జిల్లాలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో చోరీ జరిగింది. రామచంద్రాపురం అశోక్‌నగర్‌లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 6 తులాల బంగారం, 8 కిలోల వెండి, రూ. 90 వేలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు.