NZB: జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా మంటలను అదుపు చేశారు. కార్యాలయంలో గల ఫర్నిచర్, కంప్యూటర్స్, అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంతో అగ్ని ప్రమాదం సంభవించవచ్చని ఫైర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.