వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం అందుకుంది. తొలి విడత నామినేషన్లు నేటి నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 29 వరకు స్వీకరణ, 30న స్క్రూటినీ, డిసెంబర్ 3లోపు ఉపసంహరణ కాగా.. రెండో విడతకు 30 నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు, 3న స్కూటినీ, 6న ఉపసంహరణకు అవకాశం ఉంది. మూడో విడతకు డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్లు, 6న స్కూటినీ, 9న ఉపసంహరణ చేసుకోవచ్చు.