TPT: తిరుపతి నగరానికి నీటి సరఫరా చేస్తున్న తెలుగు గంగ హెడ్ వాటర్ వర్క్స్ నిర్వహణ పనుల వలన గురువారం నగరంలో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని నగరపాలక సంస్థ ఎన్.మౌర్య తెలిపారు. యం.డి.పుత్తూరు పంప్ హౌస్, మంగళం పంప్ హౌస్‌లలో ప్రధాన వాల్వులు దెబ్బతిన్నాయని తెలిపారు. వాటికి మరమ్మతులు చేయనున్నామని, గురువారం ఒక్క రోజు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.