KMR: అగ్రవర్ణాల పెత్తనం అణచివేతకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్ అన్నారు. పట్టణంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణి అవలంభిస్తోందన్నారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న వైఖరి పూర్తిగా అన్యాయమని మండిపడ్డారు.