KNR: భారత రాజ్యాంగం కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని, రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ అని BJP జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడి వేణు ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం రోజున కరీంనగర్లోని పార్లమెంట్ కార్యాలయంలో రాజ్యాంగ సంవిధాన్ దివస్ వేడుకలు నిర్వహించారు.