KRNL: ఆదోని మం. నాగలాపురం గ్రామంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అంగన్వాడీ టీచర్‌ను, ఆయాను జిల్లా కలెక్టర్ తొలగించిన విషయం తెలిసిందే. మనోవేదనకు గురైన అంగన్వాడీ టీచర్ పుష్పావతి ఇవాళ అస్వస్థతకు గురైంది. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్‌లో ఆదోని జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై ప్రజా సంఘాలు మండిపడుతున్నారు.