PLD: క్రోసూరు మండలం బయ్యవరంలో బుధవారం నిర్వహించిన ప్రజల వద్దకు ప్రవీణ్ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. గ్రామస్థులు పెద్దఎత్తున హాజరై తమ సమస్యలు, ఇబ్బందులను ఎమ్మెల్యేకు విన్నవించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే, వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.