కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు నవంబర్ నెల జీతాలు నిలిపివేస్తూ ఆ శాఖ ఎండీ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ‘ఫేజ్-3’లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లోని లోపాలపై ఇటీవల పరిశీలన చేపట్టారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లాలో 6,298 ఇళ్ల నిర్మాణాలకు అదనపు చెల్లింపు జరిగినట్లు గుర్తించారు.