సత్యసాయి: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి సచివాలయంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మంత్రి సవిత బుధవారం పాల్గొన్నారు. ఈ మాక్ అసెంబ్లీలో రాష్ట్రంలో 175 నియోజక వర్గాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. పెనుకొండ నియోజక వర్గం రొద్దం మండలం కొగిర జడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి కె. జయవర్ధన్ పాల్గొని సమస్యలపై గళం విప్పగా.. మంత్రి అభినందించారు.