ADB: పంచాయతీ ఎన్నికలను పూర్తిగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు.