TG: కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పవర్ స్కాంకు తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దాదాపు రూ. 50వేల కోట్ల స్కాం చేయనుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసినా.. ఒక మిషన్ ఉంటుంది.. ఆ మిషనే కమీషన్ అని ఎద్దేవా చేశారు. వాటాల పంపిణీ విషయంలో మంత్రులు ఘర్షణ పడుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రుల కుటుంబసభ్యులే బయటకు వచ్చి వాటాల అంశంపై చెబుతున్నారన్నారు.