VZM: రేపు డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజయనగరం ఆర్టీసీ డిపో ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. కాంప్లెక్స్ డీపీటీవో కార్యాలయంలో గురువారం ఉ.11 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. డిపో పరిధిలో గల ప్రయాణికులకు ఎటువంటి సమస్యలున్నా, సలహాలు ఉన్న 9959225604 ద్వారా తెలిపి నివృత్తి చేసుకోవాలన్నారు.