BHPL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఇవాళ MLC తీన్మార్ మల్లన్న పిలుపుమేరకు TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో BCలకు 42% రిజర్వేషన్ హామీ ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. BC, SC, ST మైనార్టీలు TRPలో చేరి రాజ్యాధికారం సాధించాలని రవి పిలుపునిచ్చారు. TRP నేతలు పాల్గొన్నారు.