JGL: జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో మంగళవారం ఎస్సై ఉమా సాగర్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అపరిచిత కాల్స్, డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేవారిని నమ్మవద్దని, మోసపోవద్దని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు.