గురుడు లేదా శుక్రగ్రహం సూర్యుడితో కలిసుండే మౌఢ్యమి. దీన్నే వాడుకలో ‘మూఢమి’ అని కూడా అంటాం. మూఢమి అంటే చీకటి అని అర్థం. నవగ్రహాల్లో గురుడు, శుక్రుడు తమ గమనంలో సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు తమ కాంతిని కోల్పోవడం ద్వారా మూఢమి సంభవిస్తుంది. గురు, శుక్రుడు శుభ గ్రహాలు. ఈ గ్రహాలు మౌఢ్యమి సమయంలో తేజస్సును కోల్పోవడం వల్ల శుభకార్యాలను వాయిదా వేస్తుంటారు.