TG: ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికలకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కోర్టు తీర్పు వల్ల ఆ నోటిఫికేషన్ రద్దు అయింది. కాగా, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయిన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మరి బీసీల రిజర్వేషన్లు తేలే వరకు ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం లేనట్లు తెలుస్తోంది.