రేపటి నుంచి ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యమి. అందువల్ల మాఘ మాసం వరకు పెళ్లిళ్లకు శుభముహూర్తాలు లేవు. కానీ కొన్ని అనివార్య, నిత్య కర్మలకు ఈ మౌఢ్య దోషం వర్తించదు. రోజువారీ ప్రయాణాలు, నిత్యారాధన, అభిషేకం, నవగ్రహశాంతి, జప, హోమాది శాంతులు, సీమంతం, నామకరణం, అన్నప్రాశనాది కార్యక్రమాలు, పాత ఇంటి మరమ్మతులు, నూతన వస్త్రధారణ వంటివి నిరభ్యంతరంగా చేయొచ్చు.