ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్ నారాయణ్‌పుర్ జిల్లా పోలీసుల ఎదుట.. 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో మాడ్ డివిజన్ కమిటీ సభ్యులు, PLGA, మిలటరీ దళం కమాండర్, LOS, జనతం సర్కార్ సభ్యులు ఉన్నారు. దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించిన వీరిపై రూ.89 లక్షల రివార్డు ఉన్నట్లు ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు.