VSP: భీమిలి పరిధిలోని తగరపువలస వద్ద మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టింది. భీమిలి నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.