SDPT: నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన బాల్ లక్ష్మి తనను, పిల్లలను వదిలివేరే మహిళతో ఉంటున్నాడంటూ మంగళవారం భర్త రాజు ఇంటి ముందు నిరసనకు దిగింది. వివాహేతర సంబంధం కారణంగా భర్త తనను ఇంట్లో నుంచి గెంటేశాడని ఆమె ఆరోపించింది. పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. రాజుపై సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది.