MHBD: పెద్దవంగర మండలం ఉప్పరగూడెం గ్రామంలో యువకుల అభ్యర్ధన మేరకు మంగళవారం గ్రంథాలయానికి పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు పుస్తకాలు అందించారు. గ్రామాల్లో విద్యా వనరుల పెంపు అత్యంత అవసరమని, యువత చదువు మీద దృష్టి పెట్టి ఎదగడానికి గ్రంథాలయాలు ఉపయోగపడతాయని అన్నారు.