MBNR: ఈనెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు హరియాన రాష్ట్రంలోని సోనీపట్లో జరగనున్న 35వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి తెలంగాణ జట్టుకు నవాబుపేట మండలం శామగడ్డ తాండకు చెందిన శ్యామ్ ఎంపికయ్యారు. రాష్ట్ర జట్టుకు జిల్లా క్రీడాకారుడు ఎంపిక కావడం పట్ల కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తి శుభాకాంక్షలు తెలియజేశారు.