ADB: సీఎంఆర్ఎఫ్తో పేద ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు మంజూరైన రూ.1,07,500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులున్నారు.